దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మూవీ ‘ఆర్ఆర్ఆర్’ బాక్సాఫీస్‌ను కొల్లగొడుతోంది. మార్చి 25న రిలీజైన ఈ సినిమా మొదటి వారాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు తొలిరోజే బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులు ఫుల్ మార్కులు వేయడంతో ఈ సినిమాను చూసేందుకు జనం థియేటర్లకు క్యూ కడుతున్నారు. అంతేకాదు పాత రికార్డ్స్‌ను బ్రేక్ చేస్తూ దూసుకెళ్తోంది. ఈ క్రమంలో ఈ సినిమా మొదటి వారం పూర్తి అయ్యేసరికి ప్రపంచవ్యాప్తంగా 710 కోట్లకు పైగా గ్రాస్‌ను అందుకుంది.
తొలి రోజు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించిన ఈ చిత్రం, ఫస్ట్ వీకెండ్ వరకు అదే జోరును కొనసాగించింది. ఈ సినిమా ఫస్ట్ వీక్ ముగిసే సరికి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.710 కోట్ల మేర గ్రాస్ వసూలు చేసింది. అదే సమయంలో రూ.392.45 కోట్ల షేర్ రాబట్టింది. మరో రూ.60.55 కోట్లు వసూలైతే ఆర్ఆర్ఆర్ బ్రేక్ ఈవెన్‌కు వస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇక ఆర్ఆర్ఆర్ మొదటివారం దేశవ్యాప్తంగా రూ.560 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. కేవలం హిందీలోనే రూ.132 కోట్ల (గ్రాస్) మార్కును దాటినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కర్ణాటక, తమిళనాడులో సైతం మంచి వసూళ్లతోనే మొదటి వారాన్ని ముగించింది. కేరళలో స్టైక్ వల్ల నాలుగో రోజు, ఐదో రోజు కలెక్షన్లపై ప్రభావం పడింది. అయితే ఆరు, ఏడో రోజు కలెక్షన్లు పర్వాలేదనిపించాయి.
బాహుబలి 2 చిత్రం తరువాత ఈ రేంజ్‌లో వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఆర్ఆర్ఆర్ నిలిచింది. బాహుబలి-2 ప్రపంచవ్యాప్తంగా తొలివారం రూ.860 కోట్లు వసూలు చేసి భారతీయ సినిమాకు బెంచ్ మార్క్ సెట్ చేసింది.
ఏరియా వైజ్‌గా కలెక్షన్స్ చూస్తే..
నైజాం- రూ. 77.22 కోట్లు
సీడెడ్- రూ. 37.28 కోట్లు
యూఏ-రూ. 20.97 కోట్లు
ఈస్ట్ గోదావరి- రూ. 11.16 కోట్లు
వెస్ట్ గోదావరి- రూ. 9.76 కోట్లు
గుంటూరు- రూ. 14.03 కోట్లు
కృష్ణ- రూ.10.78 కోట్లు
నెల్లూరు- రూ.6.45 కోట్లు
తెలుగు రాష్ట్రాల్లో మొత్తం- రూ. 187.65 కోట్లు షేర్ ( రూ.279.50 కోట్ల గ్రాస్)
కర్ణాటక- రూ.27.75 కోట్లు
తమిళనాడు- రూ.25.30 కోట్లు
కేరళ-రూ.8.00 కోట్లు
హిందీ- రూ.65.60 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా-రూ. 5.10 కోట్లు
ఓవర్సీస్- రూ.73.4 5కోట్లు
ప్రపంచవ్యాప్తంగా మొత్తం- రూ.392.85 కోట్లు షేర్ (గ్రాస్- 710కోట్లు)