ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ మానియా నడుస్తోంది. గురువారం అర్ధరాత్రి నుండే ప్రీమియర్స్, పలు చోట్ల బెనిఫిట్ షోలతో ఫ్యాన్స్ హంగామా నెలకొంది. సినిమా చూసిన వారంతా అద్భుతం అంటూ చర్చించుకుంటున్నారు. ఇది భారతీయ చిత్రాల్లోనే అత్యుత్తమ చిత్రంగా నిలచిపోతుందని అంటున్నారు. అంతేస్థాయిలో ఈ సినిమా రిలిజైన మొదటి రోజే రికార్డులను తిరగరాసింది. ఇప్పటి వరకు అత్యధిక రేటింగ్ అందుకున్న సినిమాల్లో ఆర్ఆర్ఆర్ టాప్ ప్లేస్ అందుకుంది.
ఇప్పటి వరకు ఐఎండీబీ రేటింగ్ ఇచ్చిన సినిమాలో 8.2తో ‘బాహుబలి’ టాప్‌లో ఉండగా.. గతేడాది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 1’ 8.4 రేటింగ్‌తో ఆ రికార్డును తిరగరాసింది. ఇప్పుడు తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ ఈ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది. మొదటి రోజు 9.2 రేటింగ్‌తో సంచలనం సృష్టించి టాప్ ప్లేస్‌లో నిలిచింది.
గతంలో ఉన్న రికార్డులన్నింటికి ఆర్ఆర్ఆర్ అలవోకగా అధిగమించింది. అయితే, ఈ సినిమాకు 10/10 ఇచ్చిన కూడా తక్కువే అంటూ అభిమానులు సోషల్ మీడియాల్లో హల్ చల్ చేస్తున్నారు. మరోవైపు ఇప్పటి వరకు ఐఎండీబీలో అత్యధిక రేటింగ్ అందుకున్నా సినిమాగా కూడా ఆర్ఆర్ఆర్ రికార్డు నమోదు చేసింది. అలాగే అమెరికాలో ప్రీమియర్ షోల ద్వారా మూడు మిలియన్ డాలర్లు రాబట్టిన తొలి తెలుగు చిత్రంగా ఆర్ఆర్ఆర్ ట్రెండ్ సెట్ చేసిన విషయం తెలిసిందే.
ఆర్ఆర్ఆర్ సినిమాను చిత్రబృందం భారీ అంచనాలతో విడుదల ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. అందుకు తగ్గట్టుగానే ప్రమోషన్స్ కూడా చేసింది. మొదటి రోజు సినిమాపై వచ్చిన పాజిటివ్ టాక్‌ను చూసిన మేకర్స్ తమ ఊహించిన దానికంటే ఎక్కువే సినిమా హిట్ అయిందని సంతోషం వ్యక్తం చేశారు.