ఆర్ఆర్ఆర్ సినిమా చూశారా… ఈ సినిమా చూస్తే రామ్ చరణ్, ఎన్టీఆర్ తో పాటు ఓ అమ్మాయి కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. సినిమా కథ మొత్తం కూడా ఆ అమ్మాయి చుట్టూనే తిరుగుతుంది. ఆ అమ్మాయి మల్లి పాత్రలో నటించింది.
‘ఆపద్భాంధవుడు’ సినిమాలో నటించిన హీరోయిన్ ఇప్పుడేంతలా మారిపోయిందో తెలుసా ? అస్సలు గుర్తు పట్టలేరు !
అయితే ఈ సినిమా చూసిన చాలా మంది ఆ అమ్మాయి ఎవరు ? బ్యాగ్రౌండ్ ఏంటి అనేది చర్చించడం మొదలు పెట్టారు. కాగా ఆ చైల్డ్ ఆర్టిస్ట్ అసలు పేరు ట్వింకిల్ శర్మ. ఆమె ది చండీఘర్. డాన్స్ ఇండియా డాన్స్ రియాల్టీ షో తో గుర్తింపు తెచ్చుకున్న ట్వింకిల్ శర్మ ఆ తర్వాత టీవీ యాడ్స్ లో కూడా నటించింది.
ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టటానికి సమంత ఎంత తీసుకుంటుందో తెలుసా ?
అయితే ఫ్లిప్ కార్ట్ యాడ్ లో చూసిన రాజమౌళి ఇంప్రెస్ అయి మల్లి పాత్ర కోసం ఎంపిక చేశారట. తమిళ భాషలో స్క్రిప్టు అందించి ఆడిషన్ కు రావాలని చెప్పారట. ఆడిషన్ చూసిన వెంటనే రాజమౌళికి నచ్చటంతో ఫైనల్ చేశారట. అయితే ఈ ఒక్క పాత్ర కోసం 160 మందిని ఆడిషన్ చేశారట.
ఇక ఈ సినిమాలో ట్వింకిల్ శర్మ కనిపించేది చాలా తక్కువ టైం అయినప్పటికీ ఆమె పాత్ర ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. నన్ను ఈడ ఇడిసిపోకన్నా అంటూ ట్వింకిల్ శర్మ ఎన్టీఆర్ తో చెప్పిన డైలాగ్, ఆ ఎమోషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ఈ సినిమాలో అజయ్ దేవగన్, అలియాభట్, శ్రీయ, ఒలీవియా మోరిస్ కీలక పాత్రల్లో నటించగా కీరవాణి సంగీతం అందించారు. డివివి దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
Advertisements
Also Read : ఆర్ఆర్ఆర్ ఊహించని వసూళ్లు.. ఆ రికార్డులన్నీ బ్రేక్