ప్రస్తుత సినీ ప్రపంచంలో ఓ ట్రెండ్ ను క్రియేట్ చేసిన సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాకు మాస్ ఫాలోయింగ్ ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ కూడా కలిసిసొచ్చిందనే చెప్పుకోవచ్చు. తోడు దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం ప్రత్యేక ఆకర్శణగా నిలిచింది.
బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ సినిమాకు అన్ని భాషల్లోనూ మంచి ఆదరణ లభించింది. అయితే.. దాదాపు రూ. వెయ్యి కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం సినిమా థియేటర్లలో రిలీజ్ అయిన కొద్దిరోజులకే ఈ సినిమా ఓటీటీలో విడుదల చేయాలని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది.
అయితే.. ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా..? అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు.. సినీ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. జూన్ 3న జీ5, నెట్‌ఫ్లిక్స్‌లలో ఆర్ఆర్ఆర్ విడుదల కానున్నట్టు సమాచారం. అయితే.. త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాశమున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను సాధించిన ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి రికార్డులు బ్రేక్ చేస్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకు థియేటర్లలో సినిమాను తిలకించిన అభిమానులు ఓటీటీలోనూ ఆదరిస్తారని ఆర్ఆర్ఆర్ బృందం అభిప్రాయపడుతోంది.