రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల అయింది. క్రమంలోనే ప్రతి భాషలో అద్భుతమైన హిట్ టాక్ సంపాదించుకుంది. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ మొత్తం ఆర్ఆర్ఆర్ ఫీవర్ పట్టుకుందంటేనే అర్థమవుతుంది ఈ సినిమా క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందనేది. కేవలం తెలుగు, తమిళం, హిందీనే కాదు.. విదేశాల్లోనూ ఆ సినిమా రఫ్ఫాడించేస్తోంది.
అంత ఎందుకండి.. చల్లటి హిమాలయ దేశమైన నేపాల్‌లోనూ ఆర్ఆర్ఆర్ సినిమా వేడి పుట్టిస్తోంది. అక్కడ అభిమానులు సినిమా చూసి తెగ చిందులేస్తున్నారు. థియేటర్లలో స్క్రీన్ల దగ్గరకు వెళ్లి డ్యాన్సులు, ఈళలు వేస్తున్నారు. ఆ వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక తమిళనాడులోని సేలంలో ఆర్ఆర్ఆర్ మూవీ కారణంగా ట్రాఫిక్ జాం ఏర్పడిందంటే అర్థంచేసుకోండి. అభిమానులు సినిమా చూసేందుకు థియేటర్ వద్ద క్యూ కట్టారు. శనివారం రాత్రి షో సినిమా టికెట్ల కోసం భారీ సంఖ్యలో జనం థియేటర్ వద్దకు చేరుకున్నారు. దీంతో చుట్టుపక్కల ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ సినిమా చూడటానికి వచ్చిన అభిమానులతో వీధులు, జంక్షన్లు కిక్కిరిసిపోయాయి.
దీంతో చుట్టుపక్కల రోడ్లన్నీ ఆర్ఆర్ఆర్ అభిమాన సంద్రంగా మారాయి. ఆ అభిమాన సంద్రంలో వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌కు ఆటంకం కలిగింది. ఆ వీడియోను ఓ అభిమాని పంచుకున్నారు. ఏ స్టార్ సినిమాకైనా మొదటి రోజు ఉన్నంత ప్రేక్షకులు తర్వాత కనిపించరు. కానీ, ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలై మూడు రోజులు అవుతున్న థియేటర్లకి వచ్చే ప్రేక్షకుల తాకిడి ఆగటం లేదు. అందుకే ఆర్ఆర్ఆర్ మూవీని సినీ ఇండ్రస్టీలో ఒక సెన్సేషన్‌గా చెప్తున్నారు.
🤩🤩🤩🙏🏻🙏🏻🙏🏻🙏🏻 #RRRMovie https://t.co/Kb3Thhm9g6
— RRR Movie (@RRRMovie) March 27, 2022
#RRR Yesterday night show in Salem, Tamilnadu.😳 Kailash Prakash! pic.twitter.com/0pMDZhx184
— அநாமதேயன் (@namasivayakutty) March 27, 2022
Advertisements