దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా రూపొందించారు. పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇద్దరు బడా హీరోలు కలిసి నటించడంతో దీని రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఫలితంగా భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. అభిమానులు కూడా ఎప్పుడెప్పుడు సినిమా విడుదల అవుతుందా అని నాలుగేళ్లుగా వెయిట్ చేశారు.
ప్రపంచవ్యాప్తంగా మార్చి 25న గ్రాండ్‌గా విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమాకు.. అంచనాలకు తగ్గట్టుగానే ప్రేక్షకుల నుంచి ఓ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో మొదటి రోజు భారీ వసూళ్లను రాబట్టింది. అంతేకాదు, విడుదలై రెండు వారాలు దాటుతోన్న దాదాపు అదే జోరు కంటిన్యూ చేస్తూ బాక్సాఫీస్ దగ్గర రికార్డులను సృష్టిస్తోంది. అయితే, మూడో శుక్రవారం మాత్రం ఈ మూవీకి తక్కువ వసూళ్లు వచ్చిన.. కొత్త రికార్డును సొంతం చేసుకుంది.
భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాల్లో మూడో స్థానంలో ‘ఆర్ఆర్ఆర్’ నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా 15 రోజుల్లోనే రూ. 541.11 కోట్లు షేర్, రూ. 980 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రం 14 రోజుల్లో 967 కోట్ల వసూళ్లు సాధించింది. అయితే, 15 రోజు ఆర్ఆర్ఆర్ సినిమా వసూళ్లు కాస్తా తగ్గాయి.
దీంతో ఇండియన్ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు రాబట్టిన మూడో చిత్రంగా రికార్డు సాధించింది. ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు రాబట్టిన మొదటి చిత్రంగా అమీర్ ఖాన్ దంగల్ రూ.2024 కోట్ల వసూళ్లతో మొదటి స్థానంలో ఉంది. తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి-2 రూ.1810 కోట్ల వసూళ్లతో రెండో స్థానంలో ఉంది. ఇక మూడో స్థానంలో ఆర్ఆర్ఆర్ చోటు దక్కించుకుంది. నాలుగో స్థానంలో బజరంగీ భాయిజాన్ రూ.969 కోట్లు, సీక్రెట్ సూపర్ స్టార్ రూ.967 కోట్లు సినిమాలు ఉన్నాయి.
#RRR with ₹969.24 cr BEATS #SecretSuperstar[₹966.86 cr] and #BajrangiBhaijaan[₹969.06 cr] lifetime figure to become the 3rd HIGHEST grossing Indian film of all time.
— Manobala Vijayabalan (@ManobalaV) April 8, 2022
Advertisements
అయితే, ఈ సినిమాను చైనా అధికారులు అక్కడ విడుదలకు అనుమతిస్తే మరింత భారీ వసూళ్లను రాబట్టేంది. కానీ, భారతీయ స్వాతంత్ర్య సమరయోధుల నేపథ్యంలో రూపొందించిన ఈ చిత్రాన్ని చైనాలో విడుదల చేయుటకు వారు అనుమతించే అవకాశం లేదు. దీంతో ఈ సినిమా రూ.980 కోట్ల వసూళ్లతో మూడో స్థానంలో నిలిచింది.