ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ఈ నెల 25న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలోనే అడ్వాన్స్ బుకింగ్స్ జోరు కొనసాగుతుంది. ఈ నెల 24వ తేదీన అమెరికాలో ఈ సినిమా ప్రీమియర్ షోలు వేయనున్నారు. ఇప్పటికే అక్కడ సందడి వాతావరణం నెలకొంది.
ఇదిలా ఉండగా ఆస్ట్రేలియాలో కూడా ఈ సినిమా భారీ స్థాయిలో విడుదల కాబోతుంది. మెల్‌బోర్న్‌లో ఏకంగా ఈ చిత్రానికి ఉన్న క్రేజ్‌ను చూసి, IMAX మెల్‌బోర్న్ థియేటర్ నిర్వాహకులు అదనపు షో లు వేయనున్నారట.
ఈ నెల 26, 27 తేదీల్లో అదనపు షోలు వేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ నెల 11న రాధే శ్యామ్ విడుదల కాగానే ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారట మేకర్స్.
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. అలియాభట్, అజయ్ దేవగన్, శ్రీయ, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు.