ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ చిత్రం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకోసం ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదల అయిన లుక్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్ని కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇదిలా ఉండగా ఈ చిత్రం యునైటెడ్ స్టేట్స్ లో ప్రీ-సేల్ కలెక్షన్లలో $ 1 మిలియన్లకు పైగా ఇప్పటికే వసూలు చేసింది. రిలీజ్ అయ్యాక దాదాపు 5 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ రావచ్చని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది నిజానికి తెలుగు సినిమాకు చాలా పెద్ద నెంబర్.
ఇక ఈ సినిమాలో అలియా భట్, ఒలివియా మోరిస్, సముద్రఖని, అజయ్ దేవగన్, శ్రియా శరణ్ లు కీలక పాత్రలు పోషించనున్నారు. MM కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాని DVV దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించారు.