టాలీవుడ్ మోస్ట్ అవైయిటెడ్ చిత్రం ఆర్ఆర్ఆర్.. అంచనాలకు తగ్గట్లే అదరగొడుతోంది. మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకుంది. బాక్స్ ఆఫీస్ కలెక్షన్లను షేక్ చేస్తూ.. కొత్త కొత్త రికార్టులు సృష్టిస్తోంది. ఇప్పటికే అనేక రికార్డులను బ్రేక్ చేసిన ఆర్ఆర్ఆర్.. తాజాగా మరో అరుదైనా ఘనతను దక్కించుకుంది.
దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ మూవీ కోసం అభిమానులు నాలుగేళ్లకు పైగా వెయిట్ చేశారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి అగ్ర హీరోలు కలిసి నటించిన ఈ సినిమా అనుకున్నట్టే భారీ హిట్ కొట్టింది. ఆర్ఆర్ఆర్ చిత్రం రికార్డులు తిరగరాస్తూ బాక్సాఫీస్ వద్ద రూ.వెయ్యి కోట్ల కలెక్షన్ల దిశగా దూసుకెళ్తోంది.
అంతే కాదు, ఇంటర్నేషనల్ మూవీ డేటా బేస్(ఐఎండీబీ) సంస్థలో మోస్ట్ పాపులర్ లిస్ట్‌లో ప్రపంచవ్యాప్తంగా టాప్ 5 సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అలాగే, ఏకైక ఇండియన్ సినిమాగానూ రికార్డు సృష్టించింది. పైగా ఆర్ఆర్ఆర్ చిత్రం ఇతర హాలీవుడ్ సినిమాలను మించి ఎక్కువ రేటింగ్‌ను కూడా నమోదు చేసుకుంది. దీంతో ఈ సినిమా సెన్సేషన్ ప్రపంచ వ్యాప్తంగా ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
#RRRMovie at Top #5… Only Indian film in the most popular movies on @IMDB .
R R R…. 🔥🌊🌟 https://t.co/AqBfnVQnDY pic.twitter.com/3wKi7RCoRN
— RRR Movie (@RRRMovie) April 4, 2022
Advertisements
బహుబలి సినిమాతో తెలుగు ఇండ్రస్టీ రేంజ్‌ను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేశారు రాజమౌళి. ఆ సినిమాతో ఇటు జక్కన్న, అటు హీరో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌లుగా ఎదిగారు. అయితే, తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాతో మరోసారి ప్రపంచవ్యాప్తంగా టాలీవుడ్ సత్తా చాటారు.
జక్కన్న కథలో భావోద్వేగాల్ని పండించడంలో మాస్టర్ అని చెప్పాలి. ఆయన సినిమా అంటే భావోద్వేగాలతో పాటు, తెరకు నిండుదనం తీసుకొచ్చే విజువల్ గ్రాండ్‌నెస్ కూడా ఉంటాయి. ఆ రెండు విషయాల్లో తనదైన ప్రభావం చూపించి తాను ‘మాస్టర్ కెప్టెన్’ అని దర్శకధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్తో మరోసారి నిరూపించుకున్నారు.