దర్శకధీరుడు రాజమౌళి మదిలో పుట్టిన అద్భుత సృష్టి.. ‘రౌద్రం రణం రుధిరం(ఆర్ఆర్ఆర్)’. కరోనా కారణంగా కొన్ని నెలల పాటు వాయిదా పడిన ఈ చిత్రం.. ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ చిత్రం.. అన్ని చోట్లా సందడి చేస్తోంది.
భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 10వేల స్క్రీన్స్‌లో ఈ చిత్రం రిలీజైంది. విడుదలైన అన్ని చోట్లా సందడి చేస్తున్న ఆ చిత్రం.. కొన్ని చోట్లా మాత్రం ప్రేక్షకులు ఎవరు లేక వెలవెల పోతున్నాయి థియేటర్లు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని అన్ని థియేటర్లలో ఈ మూవీ కి ప్రేక్షకులు ఆసక్తి చూపడంలేదు. సినిమా టికెట్ ధర రూ. 230 ఉండటమే అందుకు కారణం అంటున్నారు ప్రేక్షకులు.
అంతేకాకుండా.. కొన్ని చోట్ల విషాదఛాయలు అలుముకున్నాయి. తమ అభిమాన హీరోల సినిమాను చూడటానికి వచ్చిన కొందరు అభిమానులు భావోద్వేగాలకు తట్టుకోలేక గుండే పోటుకు గురయ్యారు. అలాంటి ఘటనే అనంతపురం జిల్లాలో జరిగింది.
జిల్లాలోని ఎస్ వీ మ్యాక్స్ థియేటర్ లో బెనిఫిట్ షో చూస్తూ.. ఓబులేసు(30) అనే వ్యక్తి గుండెపోటుకు గురయ్యాడు. చికిత్స కోసం అతన్ని ఆసుపత్రికి తరలించారు. కానీ.. మార్గమధ్యంలో అతడు మృతి చెందినట్లు కిమ్స్ వైద్యులు సందీప్ ధ్రువీకరించారు. మృతుని కుటుంబ సభ్యులు, స్నేహితులు శోకసముద్రంలో మునిగిపోయారు.