పాన్ ఇండియా మూవీగా వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ఓవర్సీస్ లో దుమ్ముదులుపుతోంది. ఇప్పటికే ఈ సినిమా ఓవర్సీస్ టాప్ గ్రాసర్స్ మూవీస్ లిస్ట్ లో రెండో స్థానానికి ఎగబాకింది. ఇప్పుడు బాహుబలి-2ను కూడా క్రాస్ చేసేందుకు వడివడిగా దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు 14 మిలియన్ డాలర్ల వసూళ్లు వచ్చాయి. బాహుబలి-2ను కూడా క్రాస్ చేయాలంటే ఇంకో 6 మిలియన్ డాలర్లు కావాలి.
20 మిలియన్ డాలర్ల కలెక్షన్ తో బాహుబలి-2 సినిమా ఓవర్సీస్ లో టాప్ పొజిషన్ లో ఉంది. ఏ భారతీయ సినిమాకు దక్కని అరుదైన రికార్డ్ ఇది. ఇప్పుడీ రికార్డ్ ను మరో తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్ బీట్ చేయడానికి దూసుకుపోతోంది. నిజంగా ఇది టాలీవుడ్ గర్వించదగ్గ విషయమే.
అయితే ఆర్ఆర్ఆర్ విడుదలై ఇప్పటికే చాలా కాలమైంది. వీకెండ్స్ లో వసూళ్లు తప్పితే, వర్కింగ్ డేస్ లో ఆ సినిమాకు పెద్దగా రెవెన్యూ రావడం లేదు. పైగా కేజీఎఫ్-2 కూడా వచ్చేసింది. దీంతో ఈ సినిమాకు ఓవర్సీస్ లో అదనంగా మరో 6 మిలియన్ డాలర్లు వస్తాయా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ గా నిలిచింది. ట్రేడ్ అంచనా ప్రకారం.. బాహుబలి-2ను ఆర్ఆర్ఆర్ క్రాస్ చేసే అవకాశాలు చాలా తక్కువ.
ఓవర్సీస్ టాప్ 10 తెలుగు మూవీస్ (Overseas top 10 lifetime grossers)
బాహుబలి 2 – $20,571,695
ఆర్ఆర్ఆర్ – $14 million (ఇంకా థియేటర్లలో ఉంది)
బాహుబలి 1 – $6,861,819
అల వైకుంఠపురములో – $3,635,809
రంగస్థలం – $3,513,450
భరత్ అనే నేను – $3,416,451
సాహో – $3,233,611
శ్రీమంతుడు – $2,883,437
సైరా – $2,608,115
మహానటి – $2,543,515
పుష్ప – $2,478,144
గీతగోవిందం – $2,465,367