బాహుబలి-2 సినిమా నార్త్ లో 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఆ తర్వాత సాహో, రీసెంట్ గా పుష్ప సినిమాలు కూడా వంద కోట్ల క్లబ్ లో చేరాయి. మరి తాజాగా రిలీజైన ఆర్ఆర్ఆర్ సినిమా వంద కోట్ల క్లబ్ లో చేరిందా? ఇప్పటివరకు ఈ సినిమా ఇంకా వంద కోట్ల క్లబ్ లో చేరలేదు. కానీ ఇప్పుడా టైమ్ రానే వచ్చింది.
అవును.. నిన్నటితో 10 రోజుల రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ఉత్తరాదిన ఇప్పటివరకు 92 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. మరో 8 కోట్ల రూపాయలు వస్తే ఈ సినిమా వంద కోట్ల క్లబ్ లో చేరినట్టవుతుంది. ఈ సినిమాకు మరింత ఊపు తీసుకొచ్చేందుకు, ప్రస్తుతం హీరో రామ్ చరణ్, ఉత్తరాదిన వివిధ ధియేటర్లను సందర్శిస్తున్నాడు. అభిమానుల్ని పలకరిస్తున్నాడు.
మరోవైపు ఈ సినిమా వంద కోట్ల క్లబ్ లో చేరితే లాభాల్లోకి వచ్చినట్టు కాదు. ఇంకా చెప్పాలంటే, బ్రేక్ ఈవెన్ కూడా అయినట్టు కాదు. ఈ సినిమా బ్రేక్ఈవెన్ అవ్వాలంటే.. వంద కోట్ల క్లబ్ లో చేరడంతో పాటు.. అదనంగా మరో 5 కోట్ల రూపాయలు రావాలి. అప్పుడు మాత్రం ఉత్తరాదిన ఈ సినిమా క్లీన్ హిట్ అనిపించుకుంటుంది.
ఇప్పటికే సినిమా విడుదలై 10 రోజులు దాటింది. ఇక మిగిలింది మరో వీకెండ్ మాత్రమే. రాబోయే శని, ఆది వారాల్లో ఈ సినిమాకు ఉత్తరాదిన వచ్చే వసూళ్లే ఇక ఫైనల్ అనుకోవాలి. ఆ తర్వాత బాలీవుడ్ నుంచి క్లోజింగ్ కలెక్షన్లు వచ్చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఉత్తరాదిన ఈ సినిమా బాహుబలి-2 దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయింది.