ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం మార్చి 25న భారీ స్థాయిలో విడుదల కాబోతుంది.
ఇదిలా ఉండగా ఈ సినిమా మలేషియా థియేట్రికల్ హక్కులను మాలిక్ స్ట్రీమ్స్ కార్పొరేషన్ పెద్ద మొత్తానికి కొనుగోలు చేసింది. ఇదే విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
మాలిక్ స్ట్రీమ్స్ మలేషియాలో ప్రముఖ పంపిణీ సంస్థ. మలేషియాలో ఆర్ ఆర్ ఆర్ సినిమాని పంపిణీ చేసే హక్కులను అతిపెద్ద, ఉన్నతమైన పంపిణీ సంస్థ మాలిక్ స్ట్రీమ్స్ పొందింది అంటూ మేకర్స్ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రంలో అలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే శ్రియ, అజయ్ దేవగన్ లు కీలక పాత్రలో నటిస్తున్నారు.