మార్చి 25న విడుదల కానున్న ఆర్ఆర్ఆర్ కోసం సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకుల్లో ఈ చిత్రానికి విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది.
అయితే ఇప్పుడు RRR నిర్మాతలు IMAXతో జత కట్టారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఒక ప్రత్యేక పోస్టర్‌ను వదిలారు. IMAXలో భారతదేశపు అతిపెద్ద యాక్షన్-డ్రామాను చూడండి అంటూ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
ఇక ఈ సినిమాలో రామ చరణ్ అల్లూరి సీతా రామరాజుగా జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్నారు. అలియా భట్ మరియు ఒలివియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తుండగా, అజయ్ దేవగన్, శ్రియా శరణ్, రే స్టీవెన్‌సన్, సముద్రఖని మరియు అల్లిసన్ డూడీ ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం కీరవాణి అందించగా డీవీవీపై దానయ్య నిర్మిస్తున్నారు.