దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ఆర్ ఆర్ ఆర్. బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీం గా ఎన్టీఆర్ కనిపించబోతున్నారు. మరోవైపు బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా బిజినెస్ అన్ని చోట్ల భారీగా జరుగుతుంది.
తాజాగా తమిళ రైట్స్ ను మలైకా ప్రొడక్షన్స్ వారు భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సుమారు 40 కోట్ల బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఒక్క తమిళ్ లోనే ఈ స్థాయిలో బిజినెస్ జరిగిందంటే ఇక వరల్డ్ వైడ్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.