దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ వర్కింగ్ టైటిల్ తో సినిమా తెరకెక్కుతోంది. చారిత్రక కథ చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాలో రామ్ చరణ్,ఎన్టీఆర్ లు ప్రధాన ప్రాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. పిరియాడికల్ యాక్షన్ చిత్రంగా వస్తోన్న ఈ చిత్రంలో రామ్ చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామాజు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరంభీం గెటప్ లో కనిపించనున్నారు. వీరికి జంటగా ఇంగ్లిష్ నటి ఒలివియా మోరిస్, బాలీవుడ్ భామ అలియా భట్ నటిస్తున్నారు. అలాగే ఓ కీలక పాత్రలో హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్ కుడా నటిస్తున్నాడు. బాహుబలి తరువాత రాజమౌళి మరోసారి అదే స్థాయిలో సినిమా నిర్మిస్తుండటంతో ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక, ఈ సినిమా రిలీజ్ వరకు ఎలాంటి విషయాలు బయటకు వెళ్ళకూడదని డైరక్టర్ రాజమౌళి చిత్ర యూనిట్ ను ఆదేశించారు. చిత్రీకరణ విషయంలోను, కథకు సంబదించిన విషయాలు బయటకు పొక్కకుండా జాగ్రత్త వహించాలని సూచనలు చేశారు. కానీ ఈ సినిమాకు సంబందించిన ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమాలో కొమరంభీం పాత్రలో కనిపించనున్న ఎన్టీఆర్… నవాబుల ఆయుధ సామగ్రిని తీసుకేళ్తోన్న ట్రైన్ పై దాడి చేస్తాడట. ఈ సమయంలో వచ్చే ఫైట్ విజువల్స్ అద్భుతంగా తెరకెక్కించాలని స్టార్ డైరక్టర్ రాజమౌళి భావిస్తున్నారట. అందుకుగాను ఆయన ఫైట్ మాస్టర్ లతో సమాలోచనలు చేస్తున్నాడట.