RRR Movie Mistake ఇంత పెద్ద మిస్టేక్ చేస్తే ఎలా రాజమౌళి ? ప్రేక్షకులు కనిపెట్టేశారు దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఆర్.ఆర్.ఆర్. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రం ఘనవిజయం సాధించడంతో పాటు మంచి కలెక్షన్స్ కూడా సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటిటి లో కూడా రిలీజ్ అయింది. థియేటర్స్ లో చూడనివారు ఓటిటి లో పెద్ద సంఖ్యలో సినిమా చూస్తున్నారు.
అయితే ఒకటికి పదిసార్లు చూస్తున్న కొత్త మంది సినీ అభిమానులు ఆర్ఆర్ఆర్ సినిమా లో జక్కన్న చేసిన తప్పులను గుర్తిస్తున్నారు. మొన్నటికి మొన్న నెంబర్ ప్లేట్ విషయంలో ఒక్కో సీన్ లో ఒక్కో విధంగా చూపించాడు అంటూ కొంత మంది నెటిజన్స్ నెగిటివ్ కామెంట్స్ చేశారు.
ఇప్పుడు రాజమౌళి చేసిన మరో పెద్ద మిస్టేక్ ను పట్టుకున్నారు. అది ఏంటంటే ఈ సినిమాలో ఇంటర్వెల్ ముందు ఎన్టీఆర్ జంతువులతో ఒక ట్రక్ లో నుంచి దిగుతాడు. ఆ సమయంలో పులులు జింకలు గ్రాఫిక్స్ ని సెట్ చేశారు.
ఇది చూసిన నెటిజన్స్ పులులు జింకలు ఒకే బోన్ లో ఎలా పెడతారు… కనీసం రాజమౌళి చూసుకోలేదా, ఇంత నిర్లక్ష్యంగా ఉన్నాడా అంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. మరి రాజమౌళి దీనిపై ఎలా స్పందిస్తాడో చూడాలి.
Also Read: ఎన్టీఆర్ కొత్త సినిమా.. హీరోయిన్ గా సాయిపల్లవి..?
నజ్రియా ఇష్టాలు బయటపెట్టిన నాని