‘ఆర్ఆర్ఆర్’ మూవీ ఇప్పటికే ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డులను సొంతం చేసుకుంది. ఇప్పటివరకూ ఉన్న రికార్డ్స్ అన్నింటినీ తిరగ రాస్తూ అవార్డుల పంట పండిస్తోంది. ఈ చిత్రంలోని సాంగ్స్, ఫైట్స్, డైలాగ్స్, డ్యాన్స్ ఇలా ప్రతీ ఒక్కటీ సెన్సేషనే. ముఖ్యంగా నాటు నాటు పాటకు ప్రపంచ వ్యాప్తంగా వస్తోన్న క్రేజ్ మామూలుగా లేదు.
నాటు నాటు సాంగ్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ కు నామినేట్ అయింది. ఈ వేడుక మార్చి 12న ఘనంగా జరగనుంది. అయితే ఈ వేడుకల్లో నాటు నాటు సాంగ్ లైవ్ ప్రదర్శన ఉండబోతున్నట్లు సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి.
తాజాగా ఈ కామెంట్స్ పై ఆస్కార్ నిర్వాహకులు రియాక్ట్ అయ్యారు. మార్చి 12న ఆస్కార్ వేదికపై నాటు నాటు సాంగ్ లైవ్ షో ఉంటుందని ప్రకటించారు. సింగర్స్ రాహుల్స్ సిప్లిగంజ్, కాల భైరవ ఈ పాటకు ప్రదర్శన ఇస్తారని వెల్లడించారు.
దీంతో తెలుగు సినీ ప్రేక్షకులు ఖుషీ అవుతున్నారు. ఆస్కార్ వంటి గొప్ప వేదికపై మనవాళ్లు లైఫ్ ప్రదర్శన ఇస్తున్నారంటే తెలుగు వారందరికీ గర్వకారణం. ఇక దీనిపై రాహుల్ సిప్లిగంజ్ ఆనందం వ్యక్తం చేశాడు. ‘ఇది తన జీవితంలో మర్చిపోలేని సందర్భం అని, ఆ క్షణాల కోసం ఆతృతతో ఎదురుచూస్తున్నానని’ ట్వీట్ చేశాడు.