రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో అలియా భట్, అజయ్ దేవగన్ కూడా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నిజానికి మే లో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా అక్టోబర్ కి వాయిదా పడింది. మళ్లీ సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు టాక్ నడిచింది. మళ్లీ ఏమైందో గానీ దసరాకి ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.
అయితే తాజా సమాచారం ప్రకారం… వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాని మళ్లీ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. జనవరి 8న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారట. అందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా త్వరలో రానున్నట్లు తెలుస్తోంది.