
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్నఈ సినిమాలో కొమరం భీంగా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ కనిపించబోతున్నారు. అలాగే అజయ్ దేవగన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇక ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. డిసెంబర్ 9న ఈ ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు ముహూర్తం పెట్టుకున్నారు. అయితే తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా భీం ఫర్ యు అంటూ కొత్త పోస్టర్ ని పోస్ట్ చేశారు. ఈ పోస్టర్ లో కండలు తిరిగిన దేహంతో రౌద్రంగా కనిపించాడు ఎన్టీఆర్. ఈ పోస్టర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. అలాగే ఈ సినిమా ట్రైలర్ పై కూడా అంచనాలను పెంచింది.
That’s BHEEM for you…
#RRRTrailerin3Days #RRRMovie #RRRTrailer pic.twitter.com/bs9DI5gR5F
— Jr NTR (@tarak9999) December 6, 2021
Advertisements
Also Read: యువరాణి కోసం హరిహర వీరమల్లు ఇబ్బందులు ?