ఆర్ఆర్ఆర్ నుంచి వరుస అప్డేట్స్ ను మేకర్స్ ఇస్తున్నారు. సోమవారం ఉదయం కొమరం భీం పాత్రకు సంబంధించి ఎన్టీఆర్ కొత్త పోస్టర్ ని రిలీజ్ చేసిన మేకర్స్ తాజాగా రామ్ చరణ్ కు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. రామ్ ఫర్ యు అంటూ రామ్ చరణ్ ఈ పోస్టర్ ని సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ఇక ఈ పోస్టర్ లో రామ్ చరణ్ సిక్స్ ప్యాక్ తో కనిపించారు.
రామ్ చరణ్ వెనుక ప్రజలు, నల్లగా కమ్ముకున్న పొగ కనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్న సంగతి తెలిసిందే. చరణ్ సరసన అలియాభట్ సీత పాత్రలో నటిస్తోంది. జనవరి 7న రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం ట్రైలర్ ఈనెల 9న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ఒక్కొక్కటిగా అప్డేట్స్ ఇస్తున్నారు.
That’s RAM for you… #RRRTrailer #RRRMovie #RRRTrailerin3Days pic.twitter.com/qlf1OsG8wc
— Ram Charan (@AlwaysRamCharan) December 6, 2021
Advertisements