రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కొమరం భీం గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో అలియాభట్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన ఒలివియా మోరీస్ హీరోయిన్ గా నటిస్తున్నారు. అజయ్ దేవగన్, శ్రీయ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుంది.
ఇక ఇప్పుడు అక్టోబర్ లో రిలీజ్ అవుతుందని అందరూ భావించారు. కానీ మళ్ళీ వాయిదా వేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. దీనితో కొత్త డేట్స్ ఎప్పుడు అనేది మరింత ఆసక్తిగా మారింది. తాజా సమాచారం ప్రకారం… మేకర్స్ ఇప్పుడు ఒక సరికొత్త పోస్టర్ తో కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారని తెలుస్తోంది. మరి చూడాలి అది ఎప్పుడు వస్తుందో.