రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీంగా నటించబోతున్నాడు. అలాగే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించబోతున్నాడు.
ఇదిలా ఉండగా గత ఏడాది రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు జనవరి 7న సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు మేకర్స్. కానీ అది కూడా సాధ్యపడలేదు. కాగా మొన్నటికి మొన్న ఈ సినిమాను మార్చి 18న గానీ ఏప్రిల్ 28న రిలీజ్ చేయబోతున్నాం అంటూ ప్రకటించారు మేకర్స్.
కాగా తాజాగా మార్చి 25న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.ఈ మేరకు అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ ని రిలీజ్ చేశారు.
ఇక ఈ సినిమాలో అలియా భట్, అజయ్ దేవగన్, ఒలివియా మోరీస్ సముద్రకని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు.