లాక్ డౌన్ కారణంగా విడుదల అవ్వాల్సిన సినిమాలు అన్ని వాయిదా పడుతూ వస్తున్నాయి. అయితే దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రానికి కూడా ఇదే సమస్య ఏర్పడింది. 2021 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను చిత్ర యూనిట్ రిలీజ్ చెయ్యాలని భావించింది. కానీ ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ వాయిదా పడింది. దీనితో సినిమా కూడా అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు రాకపోవచ్చని నిర్మాత దానయ్య చెప్పుకొచ్చారు.
ఇప్పటివరకు 70 శాతం షూటింగ్ పూర్తయిందని మిగిలిన 30 శాతం షూట్‌ను రెండు,మూడు నెలల్లో పూర్తి చేయాల్సి ఉంది. కానీ లాక్‌డౌన్ వల్ల అది వాయిదాపడింది. దీని ప్రభావం వీఎఫ్‌ఎక్స్ పనులపై పడే అవకాశం ఉంది. దీంతో సినిమా విడుదల విషయంలో కూడా వాయిదా పడనుందని దానయ్య చెప్పుకొచ్చారు.