ఆర్ఆర్ ఆర్ చిత్రం జనవరి 7న 2022 రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే బిజినెస్ జరిగింది. ఇప్పుడు రికార్డు స్థాయిలో బుకింగ్స్ కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా యూఎస్ లో బుకింగ్స్ తారాస్థాయికి చేరుకున్నాయి. ఇంతకు ముందు ఏ ఇండియన్ సినిమాకి కూడా జరగని విధంగా బుకింగ్స్ తో 1 మిలియన్ డాలర్స్ మార్క్ ని క్రాస్ చేసింది.
డిసెంబర్ 24 రాత్రి 8 గంటల నాటికి 1.027859 మిలియన్ డాలర్స్ మొత్తం 431 లొకేషన్స్ లో మొత్తం అన్ని భాషల్లో నుంచి రాబట్టగా.. వీటితో పాటు గాలక్సీ గ్రాండ్ స్కేప్ నుండి 40,000 డాలర్లు, బి అండ్ బి ఓవర్‌ల్యాండ్ పార్క్ నుండి 19,000 డాలర్లు వసూలు చేసింది. దీనితో మొత్తం 1.086859 మిలియన్ మార్క్ ని రిలీజ్ కి ముందే వసూలు చేసింది.