యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. రాజమౌలి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రాంచరణ్, ఎన్టీఆర్ హీరోలుగా వస్తున్న ఈ సినిమాలో అల్లూరి సీతారామ రాజుగా రాంచరణ్, కొమరం భీం గా ఎన్టీఆర్ నటిస్తున్నారు. అయితే ఇటీవల రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా రాంచరణ్ లుక్, టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసి మెగా అభిమానులకు మంచి జోష్ ను ఇచ్చింది.
ఇక పోతే బుధవారం ఎన్టీఆర్ పుట్టిన రోజు. పుట్టిన రోజు నాడు ఎన్టీఆర్ టీజర్ వస్తుందని ఫ్యాన్స్ అందరూ భావించారు. కానీ లాక్ డౌన్ వల్ల తాము అనుకున్న సమయానికి టీజర్‌ని పూర్తి చేయలేకపోయామని, అందుకే ఈసారి ఫస్ట్ లుక్‌గానీ, టీజర్ గానీ చూపించడం కుదరడం లేదని ఆర్ఆర్ఆర్ అధికారికంగా ప్రకటించింది. ఇది వరకు ఎన్టీఆర్ అభిమానులకు మాట ఇచ్చామని, ఆదరాబాదరగా ఏదో ఓ టీజర్‌ని విడుదల చేయలేమని, ఎన్టీఆర్ టీజర్ ఎప్పుడు బయట పెట్టినా అది అభిమానులకు ఓ పండగలా ఉండబోతోందని చెప్పుకొచ్చారు చిత్ర యూనిట్. అయితే నిజానికి ఎన్టీఆర్ టీజర్ ను రిలీజ్ చెయ్యాలని చిత్ర యూనిట్ ప్రయత్నించినప్పటికీ సరిపడేంత ఫుటేజ్ లేకుండా పోయింది.