రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు అజయ్ దేవగన్, అలియా భట్ కూడా నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్ , సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
అయితే ఇదిలా ఉండగా డిసెంబర్ 3న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల ఈ ట్రైలర్ రిలీజ్ డేట్ ను పోస్ట్ పోన్ చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని తెలిపారు. అయితే డిసెంబర్ 10న ఈ ట్రైలర్ రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Due to unforeseen circumstances we aren’t releasing the #RRRTrailer on December 3rd.
We will announce the new date very soon.
— RRR Movie (@RRRMovie) December 1, 2021
Advertisements