జనవరి 7,2022 న ఆర్ ఆర్ ఆర్ సినిమా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 9న ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఇప్పటికే విడుదల అయిన లుక్స్, సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా సోమవారం సరికొత్త పోస్టర్స్ ను రిలీజ్ చేశారు.
కాగా తాజా రామ్ చరణ్ కు సంబంధించి ఓ కొత్త గ్లింప్స్ ను ఎన్టీఆర్ రిలీజ్ చేశారు. బ్రేస్ యూర్సెల్ఫ్ ఫర్ రామ్ అంటూ 12 సెకెన్ల నిడివితో ఈ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఇక ఇందులో మండుతున్న మంటల్లో పోలీసు యూనిఫార్మ్ తో చరణ్ నడుచుకుంటూ వస్తూ కనిపించారు. కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా… కొమరం భీం గా ఎన్టీఆర్ నటిస్తున్నారు.
Advertisements