టాలీవుడ్ జక్కన్న గా పేరు తెచ్చుకున్న రాజమౌళి బాహుబలి సినిమా తరువాత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా RRR. జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ హీరోలుగా వస్తున్న ఈ సినిమాపై టాలీవుడ్ తో పాటు సినీప్రపంచం మొత్తం ఆశక్తిగా చూస్తుంది. అయితే రాంచరణ్ సరసన అలియాభట్ నటిస్తుండగా, ఎన్టీఆర్ సరసన ఎవరు నటిస్తారు అనేది ఇప్పటివరకు చిత్ర యూనిట్ విడుదల చెయ్యలేదు. మొదట బాలీవుడ్ యాక్టర్ డైసీ ఎడ్గర్ అని అనుకున్నప్పటికీ ఆఖరులో ఆమె హ్యాండ్ ఇచ్చింది. ఇప్పుడు తాజాగా చిత్ర యూనిట్ ఎన్టీఆర్ పక్కన హాలీవుడ్ బామ ఒలివియా మోరీస్ నటించనుందని RRR టీమ్ ఎనౌన్స్ చేసింది. ఇప్పటి వరకు ఎన్టీఆర్ సరసన ఎవరు నటిస్తారు అనే ప్రశ్నకు సమాధానం దొరికింది.