ఎన్టీఆర్, రామ్ చరణ్ ల ఆర్ ఆర్ ఆర్ సినిమా మార్చి 25న విడుదలకు సిద్ధం అవుతుంది. ఈ నేపథ్యంలోనే సినిమాను ప్రమోట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన టవర్ అయిన బుర్జ్ ఖలీఫా లో మార్చి 15న ఆర్ ఆర్ ఆర్ పోస్టర్ ప్రదర్శించనున్నారట. ఒక తెలుగు సినిమాకు ఈ రేంజ్ లో ప్రమోట్ చేయడం ఇదే మొదటిసారి.
బాహుబలితో సంచలనం సృష్టించిన రాజమౌళికి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావటంతో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.
ఇక ఈ చిత్రంలో అలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్స్ గా నటించారు. అజయ్ దేవగన్, సముద్రఖని, శ్రియ, తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రాన్ని డివివి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డివివి.దానయ్య నిర్మించారు.