ఎస్ ఎస్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం జనవరి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పుడు మార్చి 25న విడుదల కానుంది.
ఈ చిత్రం దేశీయ మార్కెట్‌లోనే కాకుండా విదేశాల్లో కూడా భారీ స్థాయిలో విడుదలవుతోంది. ఇప్పటికే, USAలో ఆర్ ఆర్ ఆర్ ప్రీ-బుకింగ్ లు ప్రారంభమయ్యాయి. ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ వారాంతానికి ఈ సినిమా ప్రీబుకింగ్ సేల్స్ లో $1 మిలియన్ దాటుతుందట. భారతీయ సినిమాకు ఇది చాలా పెద్ద నెంబర్ అనే చెప్పాలి.
దీనిని బట్టే US బాక్సాఫీస్ వద్ద ఆర్ఆర్ఆర్ ఓపెనింగ్స్ ఏ లెవెల్ లో ఉంటాయో చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో అజయ్ దేవగన్, అలియా భట్, ఒలివియా మోరిస్, శ్రియా శరణ్, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య ఈసినిమాను నిర్మిస్తుండగా ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు.