ఆర్ ఆర్ ఆర్ చిత్రం మరోసారి వాయిదా పడుతుంది అంటూ సోషల్ మీడియా లో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఎక్కడికక్కడే ఆంక్షలు, నైట్ కర్ఫ్యూ లను రాష్ట్ర ప్రభుత్వాలు విధించాయి.
.దీనితో ఆర్ ఆర్ ఆర్ సినిమాను మళ్ళీ వాయిదా వేయాలని ఆలోచనకు వచ్చారట మేకర్స్. ఈ సినిమాను ఏప్రిల్ 1న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. నిజానికి2020 జూలై 30న ఈ చిత్రం విడుదల కావాల్సిన ఉంది. అప్పటి నుంచి వాయిదా పడుతూనే వస్తుంది. చివరకు జనవరి 7, 2022న విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. కానీ ఇప్పుడు కూడా రిలీజ్ పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.