తెలుగు సినీ అభిమానులే కాకుండా యావత్ భారత చలన చిత్ర ప్రేమికులు కూడా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కళ్లలో ఒత్తులు వేసుకొని చూస్తు్న్నారు. ఎంత ఎదురు చూస్తే.. అంతగా ఊరిస్తుంది ఈసినిమా. అయితే.. తాజాగా ఆర్ఆర్ఆర్ రిలీజ్ కి సంబంధించి తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది.
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమా ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఈ సారి సంక్రాంతి సీజన్ లో పక్కాగా విడుదల చేస్తామని చిత్ర బృందం భారీ ఎత్తున ప్రచారం కూడా చేసింది. కానీ.. కరోనా మహమ్మారి విజృంభిండంతో పండగ రేసు నుంచి తప్పుకుంది.
దీంతో.. మరోసారి జూనియర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానులకు కూడా మరోసారి నిరాశే ఎదురైంది. మళ్లీ ఎదురు చూపులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా ”ఆర్ఆర్ఆర్” చిత్రాన్ని ఏప్రిల్ 29న విడుదల అవుతోందనే వార్తలు ఫిల్మిం షర్కిల్ లో చక్కర్లు కొడుతున్నాయి.
14 భాషలలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇంకా అధికారిక ప్రకటన రావడమే ఆలస్యం అని ఈసారి గురితప్పేది లేదని అంటున్నారు. చూడాలి మరి అనుకున్న టైంకి విడుదల అవుతుందో.. లేదో.