ఇటీవల కరోనా వైరస్ సోకిన బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ ఇంటికే పరిమితం అయ్యారు. తనకు కరోనా సోకిందని, ఇంట్లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్లు స్వయంగా వెల్లడించింది. అలియా ఆర్.ఆర్.ఆర్ తో పాటు సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.
అలియాభట్ పై ఓ పాటతో పాటు రాంచరణ్ జతగా కొన్ని సీన్లు ఈ నెలాఖరున షూటింగ్ చేయాల్సి ఉంది. కానీ కరోనా వల్ల మొత్తం రీషెడ్యూల్ అయ్యింది. దీంతో దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం చరణ్, ఎన్టీఆర్ లపై క్లైమాక్స్ సీన్స్ షూట్ చేస్తున్నారు. అలియా కోలుకొని వచ్చాక… వచ్చే నెలలో మిగిలిన షూట్ అంతా ఒకే షెడ్యూల్ లో పూర్తి చేయనున్నారు.
అక్టోబర్ 13న సినిమా రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించగా… మే నెలాఖరు వరకు ఎట్టి పరిస్థితుల్లో సినిమా షూట్ పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారు. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ మొదలుకానున్నాయి.