రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీకి సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. 3.15ని.ల నిడివితో ఉన్న ఈ ట్రైలర్ భారీ యాక్సన్ సీక్వెన్స్ లతో ప్రతి భారతీయుడిలో దేశభక్తిని తట్టిలేపేలా ఉంది. చిత్ర యూనిట్ ఏళ్ల తరబడి పడిన కష్టం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అద్బుతమైన డైలాగ్స్ తో రోమాలు నిక్కబొడిచే సన్ని వేశాలు తెరకెక్కించినట్టు తెలుస్తుంది. ప్రమోషన్ లో భాగంగా మోషన్ పిక్చర్స్, వీడియోలతో సగటు సినీ ప్రేక్షకున్ని తన వైపు తిప్పుకున్న చిత్ర యూనిట్ ట్రైలర్ తో మరో లెవల్ ఆసక్తిని కలిగేలా చేసింది.
సినిమాలో కొమరమ్ భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రలలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కనిపించనున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.