భారీ అంచనాలతో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీ ఆర్.ఆర్.ఆర్. నందమూరి హీరో ఎన్టీఆర్, మెగా హీరో రాంచరణ్ నటిస్తున్న ఈ చిత్రాన్ని రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బాహుబలి తర్వాత వస్తున్న సినిమా కావటంతో రాజమౌళికి కూడా ఇది కీలకం అయిన మూవీ. నిజానికి కరోనా వైరస్ రాకపోయి ఉంటే… ఈ సంక్రాంతికే మూవీ రిలీజ్ అయ్యేది.
అయితే, ప్రస్తుతం షూట్ శరవేగంగా సాగుతుండటంతో మార్చి,2021నాటికి షూట్ పూర్తయ్యే అవకాశం ఉంది. అన్ని వైపుల నుండి ఫైనాన్షియల్ ప్రెషర్ పెరుగుతుండటంతో ఎట్టి పరిస్థితుల్లోనూ దసరాకే సినిమా తీసుకరావాలని జక్కన్న ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొంత పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరిగాయని తెలుస్తోంది.