భార్యా, బావమరుదులకు భారీ షాక్ ఇచ్చాడు బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ.ఈ ఇద్దరు తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ముంబై హైకోర్టును ఆశ్రయించాడు.తన పరువునకు భంగం కలిగించినందుకు రూ.100 కోట్లు డిమాండ్ చేసాడు.
అంజనా, షంసుద్దీన్ ఇద్దరూ తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, తనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఎలాంటి కామెంట్స్ చేయకూడదని, ఇప్పుడు పెట్టిన పోస్టులు తొలగించాలని హైకోర్టు పిటిషన్ పేర్కొన్నాడు.
అంతేకాకుండా, 2008 నుంచి షంసుద్దీన్ తనకు మేనేజర్‌గా ఉన్నాడని.. తన అకౌంట్స్ చూసుకునే వాడని తెలిపాడు. ఆ టైంలోనే ఆర్థికంగా మోసం చేశాడని.. అక్రమంగా ఆస్తులు కొనుగోలు చేశాడని పిటిషన్ లో కోరాడు నవాజుద్దీన్.
ఈ నెలాఖరున (మార్చి30) న ఈ కేసుపై విచారణ జరగనుంది. అయితే, నవాజుద్దీన్ మంచి వాడు కాదంటూ అంజనా గత కొంతకాలంగా ఆరోపణలు చేస్తోంది.
ఫేమ్ వచ్చాక అతను పూర్తిగా మారిపోయాడని.. మానవత్వం మరిచిపోయాడని ఆమె అన్నారు. తనకి విడాకులు ఇవ్వకుండానే.. ఇచ్చేశానని అందరికీ ప్రచారం చేస్తు్న్నాడని ఆరోపించింది.