కొండగట్టు ఆలయానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఆలయ అభివృద్ది కోసం వంద కోట్ల రూపాయలను రిలీజ్ చేసింది.
ఈ మేరకు రాష్ట్ర ప్రణాళిక శాఖ ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయ అభివృద్ధి కోసం రూ. 100 కోట్లను మంజూరు చేస్తామని జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవ సభలో కేసీఆర్ హామీ ఇచ్చారు.
ఈ క్రమంలో గత హామీలకు అనుగుణంగా ఆలయ అభివృద్ధి కోసం వంద కోట్ల రూపాయలను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
సీఎం కేసీఆర్ కు చొప్పదండి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. కొండగట్టుకు నిధులు మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామని ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ అన్నారు.