అదానీ కంపెనీలపై హిండెన్ బెర్గ్ ఎఫెక్ట్ కంటిన్యూ అవుతూనే ఉంది. హిండెన్ బెర్గ్ రిపోర్టుతో అదానీ వ్యాపార సామ్రాజ్యం కుదేలవుతోంది. సరిగ్గా నెలరోజుల ముందు..జనవరి 24 నాటికి ఈ వ్యాపార దిగ్గజానికి చెందిన సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ. 19 లక్షల కోట్లు ఉండగా కేవలం నెల రోజుల లోగానే రూ. 12 లక్షల కోట్లకు దిగజారిపోయింది.
10 లిస్టెడ్ కంపెనీల విలువ ఇంతమేరకు.. అంటే 145 బిలియన్ డాలర్ల వరకు ఆవిరై పోయింది. దేశీయ స్టాక్ మార్కెట్ల చరిత్రలో మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇంతగా దిగజారిపోవడం పట్ల విశ్లేషకులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.
పైగా నెల రోజుల్లోనే అదానీ టోటల్ గ్యాస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్ మిషన్ కంపెనీల షేర్లు సుమారు 80 శాతానికి… మరీ ఘోర స్థితిలోకి జారుకున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే 52 వారాల కనిష్ట స్థాయికి పడిపోయాయి.
స్టాక్స్ లో తీవ్రమైన ఒడిదుడుకుల కారణంగా అదానీ 120 బిలియన్ డాలర్ల సంపద కేవలం 41 బిలియన్ డాలర్లకు తగ్గింది. ఈ పరిణామాలను సెబీ వంటి సంస్థలు నిశితంగా గమనిస్తున్నాయి. ఇటు సుప్రీంకోర్టు సైతం దీనిపై దృష్టి పెట్టింది. దీనిపై స్వతంత్ర దర్యాప్తు సంస్థ చేత విచారణ జరిపించాలని ఉత్తర్వులు జారీ చేయనుంది.