ఓ అరుదైన పాత నాణేన్ని ఎవరో ఓ మహానుభావులు రూ.2.6 కోట్లకు వేలంలో కొన్నారు. వారి పేరును బయటపెట్టలేదు.ఇంతకీ అంత విలువైన ఆ కాయిన్ ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..న్యూ ఇంగ్లండ్ (Colonial New England)లో పరిపాలన ప్రారంభమైన కొత్తలో నాణేలను ముద్రించడం జరిగింది. ఇక ఆ నాణేల్లో ఒకటి…చాలా అరుదైనది కాబట్టి… యాంటిక్ పీస్ అయ్యింది. అది 1 షిల్లాంగ్ వెండి నాణెం. 1652లో బోస్టన్‌లో ఈ నాణెమ్ని తయారుచేశారు.
ఇప్పుడు దాన్ని ఆన్‌లైన్ వేలంలో ఎవరో $3,50,000 కి కొన్నారు. అంటే మన రూపాయిల్లో రూ.2,62,09,960 అన్నమాట.ఇక ఆ నాణేన్ని కనుక పరిశీలిస్తే ఓ వైపు NE అని ఉంది. అంటే… న్యూ ఇంగ్లండ్ అని అర్థం. మరోవైపు రోమన్ సంఖ్య XII ఉంది. అంటే… ఒక షిల్లాంగ్ కాయిన్… 12 పెన్నీలతో సమానం. అమెరికాకు చెందిన వారు దీన్ని కొన్నట్లు… లండన్‌లోని మార్టన్ & ఇడెన్ లిమిటెడ్ తెలిపింది. ఇంగ్లండ్‌లోని ఓ ఫ్యామిలీ ఎస్టేట్‌లోని ఓ క్యాండీ టిన్‌లో వందల కొద్దీ పాత నాణేలు లభించాయి. వాటిలో ఇది అన్నింటికంటే పాతది.
కాయిన్ దొరికిన వ్యక్తి దాన్ని రూ.2.2 కోట్లకు అమ్ముదామనుకున్నాడు. కానీ అతనికి అంతకంటే ఎక్కువే లభించింది.ఇంతకీ ఈ కాయిన్ ప్రత్యేకత ఏంటంటే..ఈ కాయిన్ల కంటే ముందు… న్యూ ఇంగ్లండ్‌లో అధికారిక కరెన్సీ లేదట. ఇక ఆ సమయంలో ముద్రించినది కాబట్టే… ఈ కాయిన్ ki అంత విలువ ఉంది. దీన్ని ప్రింట్ చేసిన మింట్ 1682 వ సంవత్సరంలో మూతపడింది.