ఆదివారం వస్తే చాలు చికెన్, మటన్ లు తినడం అనేది చాలామందికి అలవాటుగా మారింది. అందుకు తగ్గట్టుగానే ధరలు కూడా అంతే రేంజ్ లో పెరుగుతున్నాయి. దీంతో మాంసప్రియులకు గుదిబండలా మారింది. చికెన్ ధరలు అధికంగా పెరగడంతో సామాన్యులు తినలేకపోతున్నారు.
ఆరు నెలల్లో ఎన్నడూ లేనివిధంగా కేజీ చికెన్ ధర రూ.281 పెరిగింది. ఫిబ్రవరి 7న కిలో రూ.185 ఉన్న ధర ఒక్కసారిగా రూ.100 కు చేరింది. ప్రస్తుతం స్కిన్ లెస్ చికెన్ రూ.281గా ఉంది. దీనికి తోడు వంట నూనెలు, కూరగాయలు, పప్పుల ధరలూ పెరగడంతో ఏం తినేటట్లు లేదని ప్రజలు వాపోతున్నారు.
చికెన్ వినియోగం పెరగడం, ఎండలు మండిపోతుండడంతో కోళ్ల దిగుమతి తగ్గిపోయిందని.. అందుకే ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెప్తున్నారు. వచ్చే నెల పెళ్లిళ్ల సీజన్ కావడంతో చికెన్ కిలో ధర రూ.300కు పైగానే ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. చికెన్, మటన్ ప్రియులకు, సామాన్య ప్రజలకు అధిక ధరలతో భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ధరలు అధికం కావడంతో చికెన్ వ్యాపారులు సైతం ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గతంలో రోజుకు క్వింటా చికెన్ విక్రయించేవారని.. రేట్లు పెరగడంతో రోజూ 50 కిలోలు కూడా అమ్మడం లేదని అంటున్నారు. దీంతో షాప్ రెంట్ కూడా కట్టలేని పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.