రాజ్యాంగాన్ని గౌరవించే పార్టీ బీఎస్పీ అని పేర్కొన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆదివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని అంబేద్కర్ విగ్రహానికి ప్రవీణ్ కుమార్ పూలమాల వేసి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగం ప్రకారమే పార్టీ నడుచుకుంటుందని తెలిపారు.
ఆర్టికల్ 25 అన్ని మతాలకు స్వేచ్ఛనిచ్చిందని, అన్ని మతాల విశ్వాసాలను గౌరవించాలని అన్నారు. మత విశ్వాసాలను అగౌరవ పరచడం, హేళన చేయడం తప్పని తెలిపారు. బీసీలకో న్యాయము, అగ్రవర్ణాలకో న్యాయం ఉండకూడదన్న ఆయన, అందరికీ సమానంగా న్యాయం ఉండాలని సూచించారు.
వనదేవతలైన సమ్మక్క సారలమ్మను హేళన చేసిన చినజీయర్ స్వామిపై కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. వీరితో పాటుగా రామ్ గోపాల్ వర్మ, గరికపాటిలపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అలాగే హిందు దేవుళ్లపై అనునచిత వ్యాఖ్యలు చేసినందుకు బైరి నరేష్ పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. బైరి నరేష్ కో న్యాయం, చినజీయర్ స్వామికి మరోక న్యాయం ఉండకూడదని వెల్లడించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.