ముఖ్యమంత్రి కేసీఆర్ స్క్రీప్ట్ ప్రకారమే తెలంగాణలో అన్నీ జరుగుతాయని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. క్రీడాకారులకు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో ఇళ్ల స్థలాలు కేటాయించి, గాయకుడు మొగిలయ్యకు మాత్రం బీఎన్ రెడ్డి కాలనీలో స్థలం కేటాయించడం ఏంటని మంత్రి శ్రీనివాస్ పై ఎమ్మెల్యే బాలరాజు అసహనం వ్యక్తం చేసిన విషయం విదితమే.
అయితే ఈ విషయంపై ప్రవీణ్ కుమార్ రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ‘బ్రదర్ బాలరాజు.. సీఎం కేసీఆర్ స్క్రిప్ట్ ప్రకారమే తెలంగాణలో అన్నీ జరుగుతై భయ్యా! ఇది మీకు తెల్వంది కాదు.. ఇలా మోసపోయిన వారు మీ బాస్ కేసీఆర్ పాలనలో ఎందరో ఉన్నారు’.
‘మరొక సారి బీఎస్పీ, ఆర్ఎస్పీపై రాళ్లే వేసేటప్పుడు కొంచెం ఆలోచిస్తారనే అనుకుంటున్నా’ అంటూ ప్రవీణ్ కుమార్ విమర్శించారు.