ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గంలో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు కేటాయించిన డబుల్ బెడ్ రూం ఇండ్లు అత్యంత నాసిరకంగా ఉన్నాయన్నారు. ఒకప్పుడు ఎంతో గొప్పగా బతికిన రైతన్నలు ఇప్పుడు అడ్డా కూలీలుగా మారిపోయారన్నారు.
ముట్రాజ్ పల్లికి వచ్చిన నిర్వాసితుల పిల్లలు ఎక్కడ బడికి వెళ్లాలో కూడా తెలియని స్థితి ఉందని… వారికి ఏ స్కూల్ కు వెళ్లాలో కూడా తెలియదన్నారు. వారి గురించి పట్టించుకునే వారే కరువయ్యారని ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. రాబోయే బహుజన రాజ్యంలో కన్నీళ్లుండవని, రెండు సంవత్సరాల్లో బహుజన రాజ్యం వస్తుందని జోస్యం చెప్పారు.