సీఎం కేసీఆర్ బీజేపీతో సడెన్ గా యుద్ధం ప్రకటించడం వెనుక రాజకీయ ప్రయోజనం ఉందని బీఎస్పీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. మహబూబ్ నగర్ జిల్లా ధర్మపురి గ్రామంలో బీఎస్పీ సభలో మాట్లాడిన ప్రవీణ్ కుమార్.. వరి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం డ్రామాలాడుతోందని మండిపడ్డారు. కేసీఆర్ తన ఫాం హౌస్ లో ఏం పండిస్తున్నారో ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రాజెక్టుల కోసం ఖర్చు చేసిన ప్రతీ పైసా ప్రజల నుంచి తీసుకున్నదేనని అన్నారు. రైతుకు అనుకూలంగా ఉన్న పంటలే పండిస్తారని.. ఏది పండిస్తే.. దానికి.. మద్ధతు ధర ఇచ్చి, మార్కెటింగ్ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని స్పష్టం చేశారు. ఇంత వరకూ బీజేపీతో దోస్తీ చేసి.. ఒక్కసారి బీజేపీపై అమీతుమీ అంటున్నారంటే.. ఏదో రాజకీయ ప్రయోజనం కోసమేనని ప్రవీన్ కుమార్ ఆరోపించారు