హైదరాబాద్ లోని జియాగూడలో పట్టపగలే దారుణ హత్య జరిగింది. ఆదివారం సాయంత్రం ఓ వ్యక్తిని ముగ్గురు వ్యక్తులు చుట్టుముట్టి కత్తులతో, వేట కొడవళ్లతో అంత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అయ్యాయి. ఇంత జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా ఈ ఘటనపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. హైదరాబాద్ నడిబొడ్డున పట్టపగలే రోడ్డుపై ఇంత దారుణ హత్య చోటుచేసుకుందా? రోడ్డు మీద అటుగా వెళ్తున్న వారు కూడా ఈ హత్యను ఆపలేకపోయారు.
మనమందరం స్వార్థపరులం.. అసలు ఏమీ పట్టించుకోకుండా ఎలా మారారు? రూ.వెయ్యి కోట్ల కమాండ్ సెంటర్ మనల్ని కాపాడుతుందని పాలకులు మనల్ని నమ్మించారు.
మనం మోసపోతూనే ఉన్నాం.. అంటూ ట్విట్టర్ వేదికగా ప్రభుత్వం, పోలీసుల వైఫల్యంపై మండిపడ్డారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
Trigger warning❗️⚠️
Reportedly Jangam Sainath, (32) a resident of Koti was murdered in Jiyaguda #Hyderabad
The accused fled away, police are investigating the issue pic.twitter.com/I5vQRrXrLA
— Naveena Ghanate (@TheNaveena) January 22, 2023