టీఆర్ఎస్ ప్రభుత్వంపై మాజీ ఐపీఎస్, బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ పరిస్థితిని శ్రీలంకతో పొల్చుతూ తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన ‘బిచ్చమెత్తిన సర్పంచ్’ అనే వార్తా కథనాన్ని షేర్ చేస్తూ ట్వీట్ చేశారు.
తెలంగాణలో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఉందని, ఈ విషయాన్ని పాలకులు ప్రజలకు తెలియనివ్వడం లేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. గత కొన్ని రోజులుగా పక్క దేశమైన శ్రీలంక తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోందని, ఆ పరిస్థితులు తెలంగాణలోనూ వచ్చేలా ఉన్నాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘చివరికి కేసీఆర్ గారి బంగారు తెలంగాణలో సర్పంచులను బిల్లులు, జీతాల కోసం బిచ్చమెత్తే స్థాయికి తీసుకొచ్చిండ్రు. తెలంగాణల ఆర్థిక సంక్షోభం ఉన్నది. మన పాలకులు మనకది తెలవనిస్తలేరు. మన తెలంగాణ, శ్రీలంకలా మారకూడదంటే టీఆర్ఎస్ మహిందా రాజపక్ష లా స్వచ్చందంగా గద్దె దిగవలసిందే.’ అంటూ ట్వీట్ చేశారు.
బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాదయాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యలపై, సీఎం కేసీఆర్‌పై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు.
చివరికి #KCR గారి బంగారు తెలంగాణలో సర్పంచులను బిల్లులు, జీతాల కోసం బిచ్చమెత్తే స్థాయికి తీసుకొచ్చిండ్రు. తెలంగాణల ఆర్థిక సంక్షోభం ఉన్నది. మన పాలకులు మనకది తెలవనిస్తలేరు. మన #Telangana #SriLanka లా మారకూడదంటే #TRS మహిందా రాజపక్ష లా స్వచ్చందంగా గద్దె దిగవలసిందే. pic.twitter.com/C0WQVSDU3l
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) May 10, 2022