ఓ మహిళా సర్పంచ్ దళితుడిపై దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోపై బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. టీఆర్ఎస్ పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని ఆయన ధ్వజమెత్తారు. దళిత బంధు పేరుతో సీఎం కేసీఆర్ దళితులను మోసం చేస్తున్నాడన్నారు.
శుక్రవారం ట్విటర్ వేదికగా ఆయన ఓ వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో.. ఓ మహిళ గ్రామ సర్పంచ్ ఓ వ్యక్తిపై దాడి చేస్తోంది.
ఇందుకు సంబంధించిన వీడియోను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ షేర్ చేస్తూ.. ‘దళిత బంధు పేరుతో కేసీఆర్ మోసం చేస్తుంటే.. మీ అగ్రవర్ణ సర్పంచులేమో పేద దళితులపై నార్కెట్ పల్లిలో ఎలా దాడి చేస్తున్నారో’ చూడండి. పోలీసులకు ఫిర్యాదు చేసి రెండు రోజులు గడుస్తున్నా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదన్నారు.
ఈ సర్పంచ్ ను వెంటనే అరెస్ట్ చేసి ఎస్ఐని విధుల నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వీడియోపై పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. ఓ మహిళా సర్పంచ్ అయి ఉండి అలా దాడి చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు సదరు మహిళను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
#KCR మీరేమో దళిత బందని మోసం చేయవడ్తిరి, మీ అగ్ర వర్ణ సర్పంచులేమో పేద దళితులపై నార్కెట్పల్లిలో ఎట్ల దాడి చేస్తున్నరో చూడండి. ఇక మీ పోలీసులేమో ఫిర్యాదు ఇచ్చిన రెండు రోజులకు కూడా మీ అండ చూసుకొని స్పందించడం లేదు. ఈ సర్పంచ్‌ని వెంటనే అరెస్టు చేసి, ఎస్సైని వెంటనే విధులనుండి తొలగించాలి. pic.twitter.com/ugT0YPgsHD
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) December 9, 2022