అసలు ఆట ఇంకా మొదలు కాక ముందే మీ అందరికీ తడుస్తున్నదా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు బీఎస్పీ తెలంగాణ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తాను బీఎస్పీ పార్టీకి రాజీనామా చేసి త్వరలో టీఆర్ఎస్ పార్టీలో లో చేరబోతున్నానంటూ జరుగుతున్న ఫేక్ ప్రచారంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తాజాగా స్పందించారు. అదంతా తప్పుడు ప్రచారమని కొట్టి పారేశారు.
బుధవారం ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు ప్రవీణ్. అలాంటి ఫేక్ న్యూస్ ను ప్రచారం చేసి ప్రజలను గందరగోళంలో పడేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ప్రజలను మత్తులో ముంచుతూ దశాబ్దాలుగా దోచుకుంటున్నారని, బీఎస్పీ మొదలు పెట్టిన అసలు పోరాటం ఇంకా మొదలు కాకముందే అప్పుడే టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు భయం పట్టుకుందని విమర్శించారు.
ప్రజల్లో బీఎస్పీకి ఆదరణ పెరుగుతున్నదనే కారణంతోనే తాను పార్టీ మారినట్లుగా తప్పుడు ప్రచారాలు సృష్టిస్తున్నారని ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. చిల్లర వేషాలు వేస్తున్నారని ఆరోపించారు.
అసలు ఆట మొదలు కాక ముందే మీ అందరికీ తడుస్తున్నదా అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. నేను ఎప్పటికీ బీఎస్పీతోనే ఉంటానని, మునుగోడు ఉప ఎన్నికల్లో సత్తా చాటుతానని అన్నారు బీఎస్పీ ప్రవీణ్ కుమార్.
కేవలం ఇలాంటి #FakeNews ను ప్రచారం చేసి,ప్రజలను తికమక పెట్టి,మత్తులో ముంచుతూ దశాబ్దాలుగా దోచుకుంటున్న @BJP4Telangana @trspartyonline @CongressTS అసలు జంగు ఇంకా మొదలే కాలే, అప్పుడే @BSP4Munugode అంటే మీ అందరికీ తడుస్తున్నవి. అందుకే గీ చిల్లర వేషాలు😁. #RSP4BSP4Ever #Munugode https://t.co/mWo6YNXeCI
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) October 5, 2022