రెండు రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో రెండే హాట్ టాపిక్. ఒకటి వైట్ ఛాలెంజ్.. రెండోది పరువు నష్టం దావా. అయితే మెయిన్ గా వైట్ ఛాలెంజ్ నే చూడాలి. దాని మూలాల నుంచే పరువు నష్టం దావా తెరపైకి వచ్చింది కాబట్టి. రేవంత్ విసిరిన సవాల్ ను స్వీకరించిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. మరో ఇద్దరికి ఛాలెంజ్ చేశారు. వారిలో బీఎస్పీ నేత ఆర్ ప్రవీణ్ కుమార్ ఒకరు. తాజాగా ఆయన ఈ ఇష్యూపై స్పందించారు. ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ట్వీట్
Advertisements
చివరికి మన బ్లాక్&వైట్ చాలెంజీలు తన్నులాటల, పరువు నష్టాల క్లైమాక్సుకొచ్చినయన్నమాట. రైతుల కష్టాలు, పోడు/అసైన్డ్ భూములు, కుంభకోణాలు, నిరుద్యోగ సమస్యల నుండి మన దృష్టి మళ్లించడం కోసమే ఈ హైడ్రామా! తెలంగాణ నువ్ ఎటు వైపు? ఈ చెత్త చాలెంజీల వైపా లేక చిద్రమైన బతుకుల కోసం నిలబడ్డ బహుజనుల వైపా?